Manthani: మంథని ఆసుపత్రిలో డాక్టర్లు లేరా? మంత్రి తీరుపై పుట్ట మధు ఫైర్!

Manthani: మంథని మాతా శిశు ఆసుపత్రిలో డాక్టర్ల కొరత. ప్రభుత్వ వైఫల్యంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆగ్రహం. వెంటనే వైద్యులను నియమించాలని డిమాండ్.

SHANKAR, MANTHANI
Published on: 30 May 2026 1:25 PM IST
Manthani
X

Manthani: మంథని ఆసుపత్రిలో డాక్టర్లు లేరా? మంత్రి తీరుపై పుట్ట మధు ఫైర్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో గత కొంతకాలంగా డాక్టర్ల కోరుత ఉండడంతో గర్భిణీ స్త్రీలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారం మేరకు మాతా శిశు ఆసుపత్రిని పుట్ట మధు సందర్శించి పరిశీలించారు. అక్కడ ఉన్న పేషెంట్లను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతా శిశు ఆసుపత్రిని స్థానిక మంత్రి రెండున్నర సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని, ఇంత పెద్ద ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు ఉండి ఆస్పత్రిలో అసలు డాక్టర్లు లేరు, డిస్టిక్ కలెక్టర్ కళ్ళు తెరవడం లేదు, స్థానిక మంత్రికి సోయి లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

స్థానిక మంత్రి అయ్యుండి అసలు ఆస్పత్రిలో డాక్టర్లు ఉంటున్నారా లేదా అని తెలుసుకోవడం లేదని, ఇంత పెద్ద ఆస్పత్రిలో ఒక డాక్టర్ కూడా లేనప్పుడు ఎందుకు ఈ మంత్రి పదవి అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చుట్టుపక్కల ఉన్న పెద్దపల్లి, గోదావరిఖని, కరీంనగర్ కు వెళ్లడానికి గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ఇక్కడ డాక్టర్లను కేటాయించాలని అన్నారు. కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని గుర్తుంచుకోవాలని వారికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికైనా ఇక్కడ డాక్టర్లను కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వెంబడి జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని, మంథని మాజీ జెడ్పిటిసి తగురం సుమలత శంకర్ లాల్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వేగోళపు శంకర్ గౌడ్,నాయకులు జంజర్ల శేఖర్,పుప్పాల తిరుపతి, పిల్లి సత్తయ్య తదితరులు ఉన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story