Manthani: మంథనిలో విలోచవరం రోడ్డును ముంచెత్తిన వరద స్తంభించిన రాకపోకలు
Manthani: మంథని మండలం విలోచవరంలో రోడ్యాం పైకి వరద నీరు చేరడంతో నిలిచిన రాకపోకలు! హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరిన గ్రామస్తులు.
Manthani: మంథనిలో విలోచవరం రోడ్డును ముంచెత్తిన వరద స్తంభించిన రాకపోకలు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో స్తంభించిన రాకపోకలు .
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో విలోచవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది. రోడ్డు పైన నిర్మించిన రోడ్యాం దాటనివ్వకుండా రోడ్డంతా నీటమునిగిపోవడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందుకోవాల్సిన వారు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి విలోచవరం వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.




