Manthani: మంథనిలో వైభవంగా శ్రీ మడేలయ్య స్వామి ఉత్సవాలు

Manthani: మంథనిలో రజకుల కులదైవం శ్రీ మడేలయ్య స్వామి ఉత్సవాలు ఘనం. సామూహిక బోనాలతో ఊరేగింపుగా వెళ్లిన భక్తులు. పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.

SHANKAR, MANTHANI
Published on: 19 July 2026 6:34 PM IST
Manthani
X

Manthani: మంథనిలో వైభవంగా శ్రీ మడేలయ్య స్వామి ఉత్సవాలు

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని స్థానిక బొక్కల వాగులో రజకులంతా తమ కులదైవమైన శ్రీ మడేలయ్య స్వామి ఉత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు.

తొలుత మంథని పట్టణంలోని రజక వాడ నుంచి భక్తులంతా సామూహిక బోనాలతో ఊరేగింపుగా తరలివెల్లి పట్టణంలోని శ్రీ పెద్ద పోచక్క తల్లిని దర్శించుకొని బోనాలను సమర్పించారు.

అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీ కట్ట మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బొక్కల వాగులోని శ్రీ మాడేలయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story