Manthani: మంథని ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి ఎన్నికల ప్రచారం
Manthani: ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా మంథని డిపో వద్ద యూనియన్ల ఐక్య కూటమి నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Manthani: మంథని ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి ఎన్నికల ప్రచారం
Manthani: తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల ఐక్య కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 9న జరగనున్న యూనియన్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం ప్రచారం నిర్వహించారు. జోనల్, రీజినల్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో యూనియన్ అభ్యర్థులకు మద్దతుగా కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె. శంకర్ రెడ్డి, జోనల్ నాయకులు మన్మోహన్, రీజినల్ నాయకులు ఏవీఆర్ రెడ్డి, కొమ్మ కొమురయ్య యాదవ్, కాళీదాస్, సాధుల కిషోర్ పాల్గొన్నారు. డిపో నాయకులు కేకే రెడ్డి, గంధం రమేష్, శేఖర్, ఐలయ్య, మునీర్, తిరుపతి, అన్వారీ, కృష్ణ, శ్రీనివాస్, విజేందర్, దేవేందర్, శశిధర్, గడ్డి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.




