Manthani: కమాన్‌పూర్ పెరపల్లి గ్రామంలో ఘనంగా సామూహిక వనభోజనాలు!

Manthani: కమాన్‌పూర్ మండలం పెరపల్లి గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 26 Aug 2026 4:42 PM IST
Manthani
X

Manthani: కమాన్‌పూర్ పెరపల్లి గ్రామంలో ఘనంగా సామూహిక వనభోజనాలు!

మంథాని: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెరపల్లి గ్రామంలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమం ఘనంగా, కోలాహలంగా జరిగింది. ప్రకృతి ఒడిలో గ్రామస్థులంతా ఒకే చోట చేరి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఎంతో ఉత్సాహంగా ఇంటి నుంచి డప్పు చప్పుళ్ల మధ్య వనభోజనాల ప్రదేశానికి తరలివచ్చారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్థులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సామూహికంగా వనభోజనాలు చేశారు.

శ్రావణ మాసంలో నిర్వహించే ఇలాంటి సామూహిక కార్యక్రమాలు గ్రామస్థుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు, ఆధ్యాత్మికతను చాటిచెబుతాయని గ్రామస్థులు తెలిపారు. పూర్వీకుల కాలం నాటి సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ, వాటిని రాబోయే తరాలకు అందించేందుకు ఇటువంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, యువత, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story