Manthani: ఐపీఎల్ వేదికపై మెరిసిన మంథని కుర్రాడు.. స్థానికుల హర్షం!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లెపల్లికి చెందిన యువకుడు అన్వేష్ క్రీడారంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు.

SHANKAR, MANTHANI
Published on: 27 May 2026 7:43 PM IST
Manthani
X

Manthani: ఐపీఎల్ వేదికపై మెరిసిన మంథని కుర్రాడు.. స్థానికుల హర్షం!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన యువ కోచ్ అన్వేష్ స్పోర్ట్స్ రంగంలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి కలిగిన ఆయన, పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చేరుకుని అదే రంగంలో స్థిరపడ్డారు. అన్వేష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (NIS) లో కోచింగ్ సర్టిఫికేషన్ పూర్తి చేసి, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో అథ్లెటిక్స్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ఇక స్పోర్ట్స్ స్టూడెంట్ ఫౌండేషన్ లో గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.

ఇటీవల ఉప్పల్ హెచ్సీఏ పిచ్ క్యూరేటర్ చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు, ఐపీఎల్ సీజన్‌లో పిచ్ క్యూరేటర్ టీమ్‌లో పనిచేసే అరుదైన అవకాశం అన్వేష్‌కు దక్కింది. ఈ సందర్భంగా వారి సంస్థ నుంచి 20 మంది సభ్యులు కూడా ఈ టీమ్‌లో భాగమై విజయవంతంగా పని చేయడం విశేషం. మంథని ప్రాంతానికి చెందిన యువకుడు జాతీయ స్థాయి క్రీడా వేదికలో తన ముద్ర వేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ లాంటి యువత స్పోర్ట్స్ రంగంలో ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story