Jammikunta: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి!
Jammikunta: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం పిలుపునిచ్చారు.
Jammikunta: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) కార్యక్రమాన్ని ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం పిలుపునిచ్చారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్ పర్సన్ స్వప్న సదానందం మాట్లాడుతూ.ఓటరు జాబితా పూర్తిస్థాయిలో పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారు తమ వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించినప్పుడు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితాను ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




