Manthani: ఎక్లాస్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 1000 మొక్కలు నాటిన అధికారులు!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మాస్ ప్లాంటేషన్ నిర్వహించారు. 1000 మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు.
Manthani: ఎక్లాస్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 1000 మొక్కలు నాటిన అధికారులు!
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో వన మహోత్సవంలో భాగంగా మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీబీజీ రాంజీ పథకం ఆధ్వర్యంలో ఎక్లాస్‌పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బొడ్డు రజిత శ్రీనివాస్, ఉప సర్పంచ్ అప్పల పర్వతాలు యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంథని ఎంపీడీవో శ్రీజా రెడ్డి హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్లాస్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని గాడిదల గండి ప్రాంతంలో సుమారు 1000 మొక్కలను 50 మంది కూలీలతో నాటించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీజా రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని కాపాడి పెంచడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, ఐకేపీ ఏపీఎం, సీసీ, మహిళా సంఘాల సభ్యులు, వీబీజీ రాంజీ ఉద్యోగులు, ఏపీఓ, జేఈ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.




