Jagtial: గీత కార్మికుల పొట్టకొట్టిన అగ్నిప్రమాదం.. జగిత్యాలలో దారుణం!

Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్నిప్రమాదం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 22 May 2026 8:13 AM IST
Jagtial
X

Jagtial: గీత కార్మికుల పొట్టకొట్టిన అగ్నిప్రమాదం.. జగిత్యాలలో దారుణం!

జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఉన్న ఈతవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు 500 ఈత చెట్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎండ తీవ్రత, గాలివేగం కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ఈతవనం మొత్తం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.

ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఈత చెట్లు కాలిపోవడంతో, గీత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈత చెట్లపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వేసవి కాలంలో ఎండలు అధికంగా ఉండటం, పొడి గడ్డి, నిర్లక్ష్యంగా పడేసిన మంటలు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story