Karimnagar: ట్రాఫిక్ నరకం రైల్వే గేటు వద్ద చిక్కుకున్న అంబులెన్స్
Karimnagar: కరీంనగర్ – జగిత్యాల జాతీయ రహదారి (NH-563) పై గంగాధర మండలం తుర్కాశీనగర్ సమీపంలో రైల్వే గేటు మూసివేయడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Karimnagar: ట్రాఫిక్ నరకం రైల్వే గేటు వద్ద చిక్కుకున్న అంబులెన్స్
కరీంనగర్: జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ సమీపంలో ఉన్న 29/T రైల్వే గేటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే గేటు మూసివేయబడటంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ట్రాఫిక్ జామ్‌లో ఒక అంబులెన్స్ కూడా చిక్కుకుపోవడం ఆందోళన కలిగించింది.
అత్యవసర సేవలకు సంబంధించిన వాహనం సకాలంలో వెళ్లలేకపోవడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి వాహనదారులు ప్రయత్నించినప్పటికీ, రహదారి సన్నగా ఉండటం మరియు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో కుదరకపోయింది. స్థానికులు, ప్రయాణికులు తరచూ ఈ రైల్వే గేటు వద్ద ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




