Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్రకు భారీగా తరలివచ్చిన జనం!

Karimnagar: కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్రకు అశేష జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రసంగిస్తూ బండి సంజయ్‌ను అభినందించి, విపక్షాలపై విమర్శలు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 Nov 2026 6:41 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్రకు భారీగా తరలివచ్చిన జనం!

కరీంనగర్: మహాపాదయాత్రలో బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాకతో కరీంనగర్ కాషాయం అయింది. పాదయాత్ర ప్రారంభానికి ముందు నితిన్ నవీన్ మాట్లాడుతూ ఈ మహాపాదయాత్రలో కంటికి కనిపించినంత దూరం ప్రజలే కనిపిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు రావాలని మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామన్నారు.

ఈ పాదయాత్రకు పెద్దసంఖ్యలో వచ్చిన కరీంనగర్ ప్రజలు అమ్మలు, యువతకు అభివాదం చేస్తున్నాను.కరీంనగర్‌లోని ప్రతి ఇంటికి అన్నదమ్ముడిలా, సొంత బిడ్డలా అండగా నిలిచిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హకి హృదయపూర్వక అభినందనలు. మహా పాదయాత్రకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలందరికీ, పార్టీ శ్రేణులకు పేరుపేరునా నా ప్రణామాలు.

ఇటీవల విపక్షాలు తమ సర్వశక్తులూ ఒడ్డినా ఒక్క రామ్‌లీలా మైదానాన్ని కూడా నింపలేకపోయాయి. కానీ బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రాంతాల్లో రామ్‌లీలా మైదానానికి పదిరెట్ల జనాన్ని సమీకరించి సత్తా చాటారు.

ప్రతిపక్షాలు దేశంలో అరాచకం సృష్టించే ప్రయత్నం చేశాయి, వారికి ఆ అరాచకమే మార్గమైతే, మాకు మాత్రం ప్రజలు, ప్రజాస్వామ్య ఆశీర్వాదం లభిస్తున్నాయి.

నేడు ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఇండీ కూటమి నేతలు నానా యాగీ చేస్తున్నారు. మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నారు.. కానీ.. రాజ్యాంగం మా మనస్సులో, హృదయంలో ఉంది..

3 కోట్ల మంది చనిపోయిన వారు ఓటరు లిస్టులో ఉండాలా? 6 కోట్లకు పైగా ఓటర్లు షిఫ్ట్ అయ్యారు.. వారికి రెండు చోట్ల ఓటు ఇవ్వాలా అని ప్రశ్నించారు.

3 కోట్లు మంది, 2002 ఓటరు లిస్టులో వారు ఎక్కడున్నారో చెప్పలేకపోతున్నారు. వారి ఓట్లే తొలగించారు. ఈ 3 కోట్ల చొరబాటుదారులకు ఓటుహక్కు ఉండాలని కాంగ్రెస్, ఇండీ కూటమి అంటోంది. కాంగ్రెస్ ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. తమ కుటుంబం, పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.రాహుల్ గాంధీ దేశంలో ఉన్నప్పుడు, విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానిస్తూనే ఉన్నారు.రాహుల్ ఇండియన్ ఎకానమీ గురించి విమర్శిస్తున్నారు.కానీ భారత్ ఆర్థిక శక్తిని ప్రపంచం గుర్తిస్తోంది.ఇండి కూటమి నేతలకు ప్రజలతో కలిసి రోడ్లపైనే సమాధానం చెప్పాలని బీజేపీ, ఎన్డీఏ నిర్ణయించాయి.

నేడు కరీంనగర్‌లో ఈ మహా పాదయాత్రకు ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చి మాతో నిలబడ్డారు. కరీంనగర్‌లోని ప్రతి ఒక్కరికీ, భారీ సంఖ్యలో తరలివచ్చిన నా తల్లులకు, ఉత్సాహంతో నిలబడిన నా యువ మిత్రులకు నా హృదయపూర్వక ప్రణామాలు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN