Karimnagar: తీగలగుట్టపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Karimnagar: కరీంనగర్ తీగలగుట్టపల్లి అమ్మవారి ఆలయం వద్ద మేయర్ కొలగాని శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
Karimnagar: తీగలగుట్టపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Karimnagar: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా, ప్రకృతిని ఆరాధించే సద్దుల బతుకమ్మ పండుగ కరీంనగర్ నగరంలో కన్నులపండుగలా సాగింది. నగరంలోని తీగలగుట్టపల్లిలో గల అమ్మవారి ఆలయం వద్ద నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
మేయర్ దంపతులు వివిధ తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి... బతుకమ్మను ఆలయం వద్ద పెట్టి సాంప్రదాయ ఉయ్యాల పాటలు, బతుకమ్మ పాటలకు మహిళలతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతూ..సందడి చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ దంపతులకు స్థానిక ప్రజలు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగర ప్రజలందరికీ మేయర్ కొలగాని శ్రీనివాస్ సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గౌరమ్మను వేడుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు.




