Karimnagar: తీగలగుట్టపల్లి ROB: పనులు నత్తనడకన సాగడంపై మేయర్ సీరియస్.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం!

Karimnagar: కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణ పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్ పరిశీలించారు. పనులు ఆలస్యమవ్వడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 April 2026 8:25 AM IST
Karimnagar: తీగలగుట్టపల్లి ROB: పనులు నత్తనడకన సాగడంపై మేయర్ సీరియస్.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం!
X

కరీంనగర్: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి రైల్వే ఓరవ్ బ్రిడ్జ్ ను సందర్శించి.. తనిఖీ చేసి పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతి పై ఆరా తీశారు.. నత్తనడకన పనులు కొనసాగుతుండటంతో అసహానం వ్యక్తం చేస్తూ ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవడంతో అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ ప్రాంతంలో గుంతల రోడ్డు దుమ్మతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అధికారులను ఆదేశించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ భూసేకరణ సంబంధించిన విషయాన్ని అధికారులు మేయర్ దృష్టికి తేవడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి సంబంధిత శాఖ చర్యలు చేపట్టేలా చూస్తామన్నారు.

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో నడవటం లేదని పురోగతిలో ఎలాంటి మార్పులేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టు ప్రత్యేక చొరవ తీస్కోని యుద్ద ప్రాతిపదికన బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రారంభం చేసిన ఒక సైడు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు కొంత ఇబ్బందులను తొలగించేలా అధికారులు చర్యలు తీస్కోవాలన్నారు. నిర్మాణ ప్రాంతంలో గుంతల రోడ్డు ,దుమ్ముతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. తక్షణమే ప్రతి రోజు నీళ్లు చల్లి దుమ్ము లేవకుండ చర్యలు తీస్కోవాలని సూచించారు. భూసేకరణ సమస్యలను. సంబంధిత శాఖలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీస్కుంటామన్నారు. పనులు కేవలం వేగంగా జరగడమే కాకుండా, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశార."ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఏడిఈఎన్ బిక్షపతి, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్, సాదినేని మునింధర్, నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story