Karimnagar: నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులే లక్ష్యం: కరీంనగర్ మేయర్!
Karimnagar: హనుమాన్ నగర్ పెద్దమ్మ తల్లి గుడి వద్ద రూ. 12.80 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
Karimnagar: నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులే లక్ష్యం: కరీంనగర్ మేయర్!
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ నగరంలోని 1వ డివిజన్ హనుమాన్ నగర్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద 12.80 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సదుపాయాలు తదితర అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన రహదారులు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి కొనసాగుతుందని మేయర్ అన్నారు.
అనంతరం స్థానిక ప్రజలు తమ డివిజన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేస్తూ నగర మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ భారీ అపర్ణ జితేందర్,26 వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ,ముదిరాజ్ సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




