Karimnagar: వికలాంగుల కాలనీలో సీసీ రోడ్డు పనులకు మేయర్ శంకుస్థాపన!
Karimnagar: నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ వికలాంగుల కాలనీలో రూ.19 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు.
Karimnagar: వికలాంగుల కాలనీలో సీసీ రోడ్డు పనులకు మేయర్ శంకుస్థాపన!
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని 21వ డివిజన్ వికలాంగుల కాలనీలో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.19 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వికలాంగుల కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అవసరమైన అన్ని మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగం , గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మున్సిపల్ అధికారులు, వికలాంగుల సంఘ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.




