Karimnagar: ఆరెపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఆరెపల్లిలో రూ.10 లక్షల ఎంజీఎఫ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Sept 2026 5:52 PM IST
Karimnagar
X

Karimnagar: ఆరెపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం!

కరీంనగర్: నగరంలోని అన్ని డివిజన్లలో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గం ముందుకు సాగుతోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.

నగర పరిధిలోని ఒకటవ డివిజన్ ఆరెపల్లిలో మున్సిపల్ సాధారణ నిధులు (MGF) రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్న మున్సిపల్ సాధారణ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఆరెపల్లిలో నిర్మించనున్న సీసీ రోడ్డు వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారుతాయని తెలిపారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత మున్సిపల్ అధికారులను, కాంట్రాక్టర్‌ను మేయర్ ఆదేశించారు. పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలకు తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

నగర అభివృద్ధికి చేస్తున్న కృషికి స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్, మున్సిపల్ అధికారులు, కాలనీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story