Karimnagar: కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నగర మేయర్

Karimnagar: కరీంనగర్ 38, 39వ డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మేయర్ కోలగాని శ్రీనివాస్. ఓపెన్ జిమ్ ప్రారంభం మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 May 2026 9:36 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నగర మేయర్

కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 38వ డివిజన్‌లో సి.ఎస్.ఆర్ ఫండ్స్ కింద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం రూ.10.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే 39వ డివిజన్‌లో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు , 38వ డివిజన్ కార్పొరేటర్ దేవసాని సరస్వతి-సత్యనారాయణ , 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్ , 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి-ప్రకాష్ , 47వ డివిజన్ కార్పొరేటర్ గాజ రామ-శివరాం , 37వ డివిజన్ కార్పొరేటర్ కె.ఎపిపి చంద్ర , కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story