Karimnagar: ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నగర మేయర్

Karimnagar: కరీంనగర్ దుర్షేడ్ ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ కొలగాని శ్రీనివాస్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Jun 2026 10:47 AM IST
Karimnagar
X

Karimnagar: ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నగర మేయర్

కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 4వ డివిజన్ దుర్షేడ్ శివారులో గల ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు

అనంతరం మల్లన్న దేవాలయం నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు ఏర్పాటు చేసిన నూతన స్ట్రీట్ లైట్లను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే నగరపాలక సంస్థ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story