Karimnagar: ₹80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్
Karimnagar: కరీంనగర్ 12వ డివిజన్‌లో ₹80 లక్షల UIDF నిధులతో అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, యాదగిరి సునీల్ రావు శంకుస్థాపన చేశారు.
Karimnagar: ₹80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్ వెంకటేశ్వరకాలనీలో వివిధ చోట్లలో ₹80 లక్షల అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ UIDF నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రజలకు కనీస అవసరాలు అయినా త్రాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ-వేణు, మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.




