Karimnagar: వాసుదేవ హాస్పిటల్స్ ఉచిత సేవలు వైద్య శిబిరానికి భారీ స్పందన!
Karimnagar: బీజేపీ నేతలు పండుగ స్వప్న–నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో, వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Karimnagar: వాసుదేవ హాస్పిటల్స్ ఉచిత సేవలు వైద్య శిబిరానికి భారీ స్పందన!
కరీంనగర్: 11వ డివిజన్ కాంటెస్టెడ్ బీజేపీ కార్పొరేటర్ పండుగ స్వప్న–నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో, డాక్టర్ ఎలగందల శ్రీనివాస్, వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం కట్టరాంపూర్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రారంభించారు.
సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వాసుదేవ మల్టీస్పెషల్ వాళ్లు అందిస్తున్న మెగా వైద్య శిబిరంలో పలు వ్యాధులకు నిర్ధారణ మందులు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. శిబిరంలో ప్రముఖ జనరల్ లాప్రోస్కోపిక్, లేజర్ సర్జన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ రోగులను పరీక్షించి బ్లడ్ షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, హెర్నియా, హైడ్రోసీల్, వెరికోజ్ వెయిన్స్, డయాబెటిక్ ఫుట్, బ్రెస్ట్ లంప్స్‌తో పాటు ఇతర శస్త్రచికిత్సలకు సంబంధించిన సమస్యలపై ఉచిత వైద్య సలహాలు అందిస్తున్నారని తెలిపారు.
ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించి ప్రజలకు వైద్యంపై అవగాహన కల్పించాలని వాసుదేవ హాస్పిటల్ డాక్టర్లను కోరారు. ఈ వైద్య శిబిరానికి డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారి వ్యాధుల నిర్ధారణ చేసుకొని ఉచిత మందులు సలహాలు పొందారు.
ఈ కార్యక్రమంలో కోలకాని నరసయ్య, మహేందర్, శేఖర్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీల ప్రముఖులు, యువకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




