Manthani: యాదవ విద్యార్థుల వసతి గృహ నిధుల సేకరణకై 21 రోజుల పాదయాత్ర!
Manthani: యాదవ విద్యార్థి వసతి గృహ నిధుల సేకరణ కోసం ఆగస్టు 14 నుండి 21 రోజుల పాటు 'శ్రీకృష్ణ సేవా - విద్యానిధి యాత్ర' నిర్వహించనున్నట్లు మల్లేశం యాదవ్ తెలిపారు.
Manthani: యాదవ విద్యార్థుల వసతి గృహ నిధుల సేకరణకై 21 రోజుల పాదయాత్ర!
మంథాని: యాదవ విద్యార్థుల ఉన్నత విద్య కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న "యాదవ విద్యార్థి వసతి గృహం" నిధుల సేకరణలో భాగంగా ఈనెల 14 నుండి 21 రోజుల పాటు "శ్రీకృష్ణ సేవా - విద్యానిధి యాత్ర" నిర్వహించనున్నట్లు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్ తెలిపారు.
శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ...ఈనెల 14న మంథని నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర వచ్చే నెల సెప్టెంబర్ 3 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. యాదవ విద్యార్థుల్లో చైతన్యం నింపి, ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెంచడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలోని యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా యాదవ విద్య నిధి యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, ట్రస్టు సభ్యులు పర్స బక్కన్న యాదవ్, మంథని మండల యాదవ సంఘం అధ్యక్షుడు పర్షవేన మోహన్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉడుత పర్వతాలు యాదవ్, జిల్లా నాయకులు కనవేన శ్రీనివాస్ యాదవ్, నాయకులు వేముల లక్ష్మణ్ యాదవ్, కనగంటి ఓదెలు యాదవ్ , బాస అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




