Metpally: మెట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే లైబ్రరీకి ఆర్థిక సాయం!

Metpally: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మెట్‌పల్లి హెల్పింగ్ హాండ్స్ లైబ్రరీకి రూ.4,500 ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకుడు ఎలుగందుల అజయ్ కుమార్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Sept 2026 12:55 PM IST
Metpally
X

Metpally: మెట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే లైబ్రరీకి ఆర్థిక సాయం!

Metpally: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు ఎలుగందుల అజయ్ కుమార్ సమాజ సేవలో భాగస్వామ్యమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకు, చదువుకు వెలుగులు నింపుతున్న 'హెల్పింగ్ హాండ్స్ లైబ్రరీ'కి ఆయన రూ. 4,500/-ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు, సభ్యులు అజయ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. "విద్యార్థుల కలలకు, వారి ఉజ్జ్వల భవిష్యత్తుకు మీ సాయం ఎంతో విలువైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మీ సేవా మనసు, మానవతా దృక్పథం అభినందనీయం" అని వారు కొనియాడారు.

​ఇలాంటి మంచి మనసున్న దాతల సహకారంతో హెల్పింగ్ హాండ్స్ లైబ్రరీ ద్వారా మరింత మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు వెలుగుదారి చూపుతూ తమ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని నిర్వహకులు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story