Metpally: జాతీయ మానవ హక్కుల సంస్థ ఉపాధ్యక్షుడిగా గోవర్ధన్

Metpally: జగిత్యాల జిల్లా మెటుపల్లికి చెందిన జర్నలిస్ట్ ఎం. గోవర్ధన్ జాతీయ మానవ హక్కుల యాంటీ కరప్షన్ బ్యూరో జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 16 Nov 2026 10:17 PM IST
Metpally
X

Metpally: జాతీయ మానవ హక్కుల సంస్థ ఉపాధ్యక్షుడిగా గోవర్ధన్

మెటుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి కి చెందిన జర్నలిస్ట్ ఎం. గోవర్ధన్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడిగా (నేషనల్ వైస్ ప్రెసిడెంట్) గోవర్ధన్‌ను నియమించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన కనబరిచిన చొరవ, సేవా దృక్పథాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు.

ఈ మేరకు సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎస్. జ్యోతీశ్వర్ రెడ్డి నవంబర్ 1, 2026న నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం 12 నెలల పాటు అమల్లో ఉండనుంది.జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టిన గోవర్ధన్ ప్రజల హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన, నేరాల నియంత్రణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ

ఇంతటి బాధ్యతను అప్ప చెప్పినందుకు ప్రజలకు పదవికి న్యాయం చేశానని అన్నారు. ప్రతి ఒక్కరు హక్కులకై పోరాడటం లో రాజీలేకుండా ఉండాలని తెలిపారు. హక్కుల పరిరక్షణకై విశ్రాంతి లేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA