Metpally: ఆత్మనగర్ గ్రామంలో నూతన అంగన్‌వాడీ కేంద్రం-2 ప్రారంభం

Metpally: మెట్టుపల్లి మండలం ఆత్మనగర్ గ్రామంలో నూతన అంగన్‌వాడీ కేంద్రం-2ను ప్రారంభించిన వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 23 Nov 2026 10:57 PM IST
Metpally
X

Metpally: ఆత్మనగర్ గ్రామంలో నూతన అంగన్‌వాడీ కేంద్రం-2 ప్రారంభం

మెట్టుపల్లి: మెట్టుపల్లి మండలం ఆత్మనగర్ గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం–2ను తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, మంచి భవిష్యత్తుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రాథమిక విద్య, ఆరోగ్య పరిరక్షణ, గర్భిణులు, బాలింతలకు అవసరమైన సేవలు అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA