Metpally: వేంపేటలో ఉత్తమ ఉపాధ్యాయుడు, కెమెరా క్లబ్ అధ్యక్షుడికి ఘన సత్కారం!

Metpally: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన నాగరాజు, కెమెరా క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన జ్ఞానేశ్వర్‌లను ఘనంగా సత్కరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Oct 2026 1:26 PM IST
Metpally
X

Metpally: వేంపేటలో ఉత్తమ ఉపాధ్యాయుడు, కెమెరా క్లబ్ అధ్యక్షుడికి ఘన సత్కారం!

Metpally: మెట్‌పల్లి మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన వేంపేట గ్రామస్థుడు గాజెంగి నాగరాజు, అదే విధంగా మెట్ పల్లి కెమెరా క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన వేంపేట వాస్తవ్యులు జోగ ఙ్ఞానేశ్వర్ లకు ఈరోజు గ్రామంలో మాజీ సింగిల్ విండో ఛైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేంధర్ రెడ్డి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసి పుల్ల శేఖర్ గౌడ్,గ్రామ పాలక సభ్యడు దశకంఠ రాజు,పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీరాంల పురుషోత్తం, జిల్లా వ్యవసాయ మెంబర్ తుమ్మల లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లి శేఖర్ గౌడ్,పెద్ది శ్రీనివాస్ గుప్తా,గాజెంగి రామస్వామి,బద్దం అంజిరెడ్డి తిప్పిరెడ్డి రమేష్, ఎలాల మహేష్, పల్లి సత్యం,పరాంకుశం నర్సయ్య, పల్లి విజయ్,ఇప్ప జలంధర్, కొట్టాల శ్రీనివాస్, మ్యాడపు రాజ శేఖర్, రాము, కడెం లక్ష్మినర్సయ్య(GM), చుక్కబొట్ల సుమన్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్