Metpally: TPMCC జనరల్ సెక్రటరీగా మెట్‌పల్లికి చెందిన తెడ్డు సురక్ష నియామకం!

Metpally: TPMCC నూతన జనరల్ సెక్రటరీగా తెడ్డు సురక్ష నియామకం. నియామక ఉత్తర్వులు జారీ చేసిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 10 Nov 2026 11:19 AM IST
Metpally
X

Metpally: TPMCC జనరల్ సెక్రటరీగా మెట్‌పల్లికి చెందిన తెడ్డు సురక్ష నియామకం!

మెట్టుపల్లి: TPMCC నూతన జనరల్ సెక్రటరీగా తెడ్డు సురక్ష నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, మహిళల హక్కుల పోరాటంలో సురక్ష అందించిన సేవలను గుర్తించి ఈ ముఖ్యమైన బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన తెడ్డు సురక్ష మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

తెడ్డు సురక్ష నియామకం పట్ల మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA