Mettupalli: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా
Mettupalli: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా నియమితులయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Mettupalli: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా
మెట్టుపల్లి: కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టిపిసిసి డెలిగేట్ మెంబర్ సుజిత్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకోగా పాషా కు నియామక ఉత్తర్వులు అందజేశారు.
రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే పాషా జిల్లా స్థాయి పదవిని కైవసం చేసుకోవడం పట్ల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతలను అప్పగించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి పాషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు స్థాయి నుంచి తనను గమనించి జిల్లా స్థాయిలో ఈ గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కష్టపడతానని, కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో తార స్థాయికి చేరవేర్చడమే తన లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ శ్రేణుల సంక్షేమానికి నిరంతరం అందుబాటులో ఉంటానని పాషా స్పష్టం చేశారు.
తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మెట్టుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కిసాన్ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలోటీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,మండల ఫిషర్మన్ అధ్యక్షుడు రోడ్డ రాజు,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, పాత దాంరాజ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేష్,కల్లెడ గంగాధర్,ఏలేటి వినోద్ రెడ్డి,బైండ్ల శ్రీకాంత్,గూడ సోల్లు ముత్యం రెడ్డి,గోపిడి నరేష్,కళ్ళెం శ్రీను,ఎట్టం మల్లేష్,సమీర్ సర్కార్, తదితరులు పాల్గొన్నారు.




