Sircilla: మిడ్ మానేర్‌లో పర్యాటకుల భద్రతకు చర్యలు ఎస్పీ తీవ్ర హెచ్చరిక!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి. గితే పరిశీలించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Aug 2026 2:30 PM IST
Sircilla
X

Sircilla: మిడ్ మానేర్‌లో పర్యాటకుల భద్రతకు చర్యలు ఎస్పీ తీవ్ర హెచ్చరిక!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మానేర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.

బ్యాక్‌వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను ఎస్పీ పరిశీలించారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

బ్యాక్‌వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

సరదా విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story