Rajanna Sircilla: మిడ్ మానేరు జలాశయం తాజా పరిస్థితి!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు జలాశయం తాజా నీటి మట్టం వివరాలు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 26 April 2026 7:32 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: మిడ్ మానేరు జలాశయం తాజా పరిస్థితి!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు జలాశయం నీటి మట్టం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.ఉదయం 6 గంటల సమయానికి జలాశయ పరిస్థితిపై అధికారికంగా విడుదలైన వివరాలు ఇలా ఉన్నాయి. జలాశయం నీటి మట్టం ప్రస్తుతం 307.50 మీటర్లు వద్ద ఉంది. మొత్తం సామర్థ్యం 318 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం ఇది సగటు స్థాయికి సమీపంలో కొనసాగుతోంది. నీటి నిల్వ పరంగా చూస్తే మొత్తం 27.55 టీఎంసీలకు గాను 7.975 టీఎంసీలు నిల్వగా ఉన్నాయి.

ఇన్ఫ్లో (నీటి ప్రవాహం) పూర్తిగా *శూన్యం (NIL)*గా నమోదైంది. ఎస్సారెస్పీ (SRSP) నుంచి గానీ, సింగరేణి యాసిడ్ ప్రాజెక్ట్ (SYP) నుంచి గానీ నీటి చేరిక లేదు. అలాగే మలువాగు, ఇతర వరద ప్రవాహాల నుంచి కూడా నీటి రాక నమోదు కాలేదు. అదేవిధంగా, స్పిల్‌వే గేట్లు మరియు రైట్/లెఫ్ట్ సైడ్ గేట్లు ఏవీ తెరవలేదు. అన్ని గేట్లు ప్రస్తుతం మూసివేసి ఉన్నాయి. అయితే, జలాశయం నుండి అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. మొత్తం 180 క్యూసెక్కులు నీరు విడుదల అవుతోంది. ఇందులో ఆవిరి (Evaporation) కారణంగా 135 క్యూసెక్కులు, మిగిలిన 45 క్యూసెక్కులు ఇతర కారణాల వల్ల విడుదల అవుతున్నాయి. రైట్, లెఫ్ట్, ప్యాకేజీ కాలువలు వంటి ప్రధాన కాలువల ద్వారా నీటి విడుదల నమోదు కాలేదు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story