Sircilla: కొదురుపాక మిడ్ మానేరులో తగ్గుతున్న నీటి నిల్వలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక పరిధిలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 25 May 2026 7:32 AM IST
Sircilla
X

Sircilla: కొదురుపాక మిడ్ మానేరులో తగ్గుతున్న నీటి నిల్వలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్ లో ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటి మట్టం 318 మీటర్ల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 307.21 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 7.624 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదు కాలేదు. ఎస్‌వైపీ (గాయత్రి పంప్ హౌస్), ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మానేరు, ములవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా నీటి ప్రవాహం లేకపోవడం గమనార్హం.

మరోవైపు రిజర్వాయర్ నుంచి మొత్తం 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆవిరీభవనం ద్వారా 95 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఆర్‌ఎస్, ఆర్‌జీ, ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ, ప్యాకేజీ-9, ప్యాకేజీ-10, జీసీఎల్‌ఎస్ మార్గాల ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు. ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు, రెగ్యులేటర్ గేట్లు ఎటువంటి వాటిని కూడా ఎత్తలేదు. రిజర్వాయర్‌లోకి కొత్తగా నీటి ప్రవాహం లేకపోవడంతో నిల్వలు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story