Sircilla: మిడ్ మానేరులో ఎంత నీరుంది? తాజా లెక్కలు ఇవే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ తాజా నీటిమట్టం వివరాలు. ప్రస్తుతం 7.830 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 8 May 2026 8:12 AM IST
Sircilla
X

Sircilla: మిడ్ మానేరులో ఎంత నీరుంది? తాజా లెక్కలు ఇవే!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్ లో ఉదయం 6 గంటల సమయానికి నీటిమట్టం 307.38 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 27.55 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.830 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదు కాలేదు. ఎస్సారెస్పీ, ఎస్‌వైపీ, మానేర్, ములవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా నీటి ప్రవాహం లేదు. ఇక రిజర్వాయర్ నుంచి మొత్తం 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆవిరీభవనం ద్వారా 95 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడి, ఎడమ కాల్వలు, ప్యాకేజీలు, గేట్ల ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు. రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లు, రేడియల్ గేట్లు ప్రస్తుతం మూసివేసి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story