Sircilla: మిడ్ మానేరు అప్‌డేట్.. ఇన్‌ఫ్లో నిల్‌.. గేట్లు అన్నీ క్లోజ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ తాజా నీటి మట్టం వివరాలు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 11 May 2026 7:03 AM IST
Sircilla
X

Sircilla: మిడ్ మానేరు అప్‌డేట్.. ఇన్‌ఫ్లో నిల్‌.. గేట్లు అన్నీ క్లోజ్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద నీటి నిల్వలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం 06:00 గంటల నాటికి రిజర్వాయర్ నీటి మట్టం 307.35 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 7.794 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌కు ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదు కాలేదు. ఎస్‌వైపీ (గోదావరి పంప్ హౌస్), ఎస్సారెస్పీ, అలాగే మానేరు, ములవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా నీటి ప్రవాహం లేదు.

అయితే రిజర్వాయర్ నుండి మొత్తం 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆవిరీభవనం ద్వారా 95 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. రైట్ సైడ్, రైట్ గేట్, ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ, ప్యాకేజీ-9, ప్యాకేజీ-10, జీసీఎల్‌ఎస్ మార్గాల ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు. ప్రస్తుతం రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లు, రైట్ సైడ్ గేట్లు పూర్తిగా మూసివేసి ఉన్నాయని అధికారులు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story