Rajanna Sircilla: మిడ్ మానేరులో ఎంత నీరు ఉందో తెలుసా? తాజా రిపోర్ట్!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ ప్రస్తుత నీటి పరిస్థితిని అధికారులు వెల్లడించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 2 May 2026 9:15 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: మిడ్ మానేరులో ఎంత నీరు ఉందో తెలుసా? తాజా రిపోర్ట్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానెర్ రిజర్వాయర్ నీటి పరిస్థితులపై తాజా వివరాలు వెల్లడయ్యాయి. ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటి మట్టం +307.44 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 318 మీటర్లు కాగా, ప్రస్తుతం సామర్థ్యం 27.55 టీఎంసీలకు గాను 7.903 టీఎంసీల నీరు నిల్వలో ఉంది. రిజర్వాయర్‌కు ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లోలు లేవని అధికారులు తెలిపారు. ఎస్‌వైపీ (గోదావరి పైపులైన్), ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుండి కూడా నీటి ప్రవాహం నిలిచిపోయింది. మానెర్, మూలవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా వరద నీరు రావడం లేదు.

అవుట్‌ఫ్లో పరంగా మొత్తం 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆవిరీభవనం ద్వారా 135 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కులు విడుదల అవుతోంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కాల్వలు, ప్యాకేజీలు-9, 10, జీసీఎల్ఎస్ వంటి మార్గాల ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు. ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు మరియు రెగ్యులేటర్ గేట్లు అన్నీ మూసివేసి ఉన్నాయి. మొత్తం మీద రిజర్వాయర్‌లోకి నీటి ప్రవాహం లేకపోవడం, నిల్వలు తక్కువగా ఉండటం గమనార్హం.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story