Rajanna Sircilla: అడుగంటిన మిడ్ మానేర్.. నిలిచిన వరద ప్రవాహం

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో అడుగంటిన నీటి మట్టం. 27.55 టీఎంసీలకు గాను కేవలం 8.048 టీఎంసీల నిల్వ.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 22 April 2026 8:09 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: అడుగంటిన మిడ్ మానేర్.. నిలిచిన వరద ప్రవాహం

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం బుధవారం ఉదయం స్వల్పంగా నమోదైంది. ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటి మట్టం +307.56 మీటర్లుగా ఉండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సమాచారం.

రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లోలు నమోదు కాలేదు. ఎస్సైపీ (జీపీఎచ్), ఎస్సార్ఎస్పీ ద్వారా కూడా నీటి ప్రవాహం లేకపోగా, మానేర్, మూలవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా వరద ప్రవాహం శూన్యంగానే ఉంది.

అవుట్‌ఫ్లోగా మొత్తం 435 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇందులో రిజర్వాయర్ సప్లై ద్వారా 250 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కులు, ఆవిరీభవనం ద్వారా 135 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. కుడి కాలువ, ఆర్ఎంసీ, ప్యాకేజీ-9, ప్యాకేజీ-10, జీసీఎల్ఎస్ ద్వారా నీటి విడుదల లేదు.

ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు ఏవీ ఎత్తలేదు. అయితే రిజర్వాయర్ కుడి వైపు గేట్లలో 1/4 గేట్ మాత్రమే తెరిచి ఉంచారు. గేట్ నంబర్-3ను 0.4 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story