Sircilla: రేవంత్ రెడ్డి సార్ మా గోడు వినండి మధ్యాహ్న భోజన కార్మికుల విన్నపం!

Sircilla: జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో మధ్యాహ్న భోజన వంట కార్మికులు తమ వేతనాలు పెంచాలని, కోడిగుడ్ల బకాయిలు విడుదల చేయాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 20 July 2026 8:40 PM IST
Sircilla
X

Sircilla: రేవంత్ రెడ్డి సార్ మా గోడు వినండి మధ్యాహ్న భోజన కార్మికుల విన్నపం!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో ఏళ్లుగా అల్ప వేతనాలతో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు గొట్టే దేవేంద్ర మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నప్పటికీ తమకు సరైన వేతనాలు, గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, తమ ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.8.50 వరకు ఉండగా, ప్రభుత్వం మాత్రం ఒక్కో గుడ్డుకు రూ.6 మాత్రమే చెల్లిస్తోందన్నారు. దీంతో ఒక్కో గుడ్డుపై వచ్చే రూ.2.50 వ్యత్యాసాన్ని తమ సొంత డబ్బులతో భరించాల్సి వస్తోందని తెలిపారు. అప్పులు చేసి మరీ విద్యార్థులకు గుడ్లు అందిస్తున్నామని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

"రేవంత్ రెడ్డి సార్... మా గోడు వినండి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించి, గౌరవప్రదమైన వేతనాలు అందించేలా చర్యలు తీసుకోండి" అంటూ ముఖ్యమంత్రికి కార్మికులు విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story