Dharmaram: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం!

Dharmaram: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.

RAMESH, DHARMPURI
Published on: 25 Aug 2026 11:40 PM IST
Dharmaram: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం!
X

Dharmaram: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన.. అభివృద్ధి పనుల ప్రారంభం!

Dharmaram: దోచుకొని దాచుకున్న వేల కోట్ల నిధిని కాపాడుకోవడం కోసమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ ను విడకుండా ఉంటున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు చీకటి ఒప్పంద పార్టీలని ధ్వజమెత్తారు.

వాయిస్ ఓవర్ : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలసి ప్రారంభించారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి,అక్కడే ఏర్పాటు చేసిన సామూహిక వన మహోత్సవం పాల్గొని మొక్కను నాటారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొని, పలువురికి కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నట్లయితే, మొన్న జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుపొందలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అన్ని పదవులు పొందిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందన్నారు.

బీజేపీతో డిల్లీలో పొత్తులు పెట్టుకొని, ఇక్కడ గల్లీలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల నిధికి కాపలా కోసమే,ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఉన్నారని విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపి, తెలంగాణ ప్రజలకు నిజాలను తెలపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ధర్మారం సర్పంచ్ దాగేటి రాజేశ్వరి, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, డీఎస్ఓ శ్రీనాథ్, తహసీల్దార్ డి.శ్రీనివాస్, ఎంపీడీవో వేముల సుమలత, ధర్మారం పీహెచ్సీ వైద్యులు అనుదీప్, సుస్మిత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story