Karimnagar: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రజా పాలన.. కరీంనగర్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు!

Karimnagar: కరీంనగర్‌లో జరిగిన మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడం మరియు పార్టీ కార్యకర్తలకు పదవులు కల్పించడంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 April 2026 9:27 AM IST
Karimnagar
X

Karimnagar: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రజా పాలన.. కరీంనగర్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు!

కరీంనగర్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా డిసిసి కార్యాలయం, ఇందిరా గార్డెన్స్ లో మహిళా సాధికారతే లక్ష్యంగా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా.మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరైనారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలు అని రంగాల్లో ముందు ఉండాలని గొప్ప ఆలోచన చేయడం జరిగింది, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నా ధర్మపురి నియోజకవర్గంలో ఏడు మండలాలలో ఒక్కొక్క మండలంలో వెయ్యి మంది మహిళలతో ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం సమావేశాలు నిర్వహించి నన్ను ఈ రోజు ఈ స్థానంలో కూర్చుండబెట్టినారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా మహిళలు రాజకీయాలలో రాణించాలని ఉన్నతమైన పదవులు అలంకరించాలని దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి చట్టసభల ద్వారా వారికి అవకాశం కల్పించాలని ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు, ఇందిరా గాంధీ ప్రధానమంత్రి గా ప్రపంచవ్యాప్తంగా గొప్ప మహిళా నేతగా నేటికీ కీర్తించబడుతున్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆలోచనతో పెట్రోల్ బంక్ యజమానులను, ఆర్టీసీ బస్సు యజమానులను చేసినారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు యజమానురాలుగా వారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ చసి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది మా ప్రభుత్వం, ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన మహిళా సోదరీమణుల పేరుతో ఉండాలని గొప్ప ఆలోచన చేసింది మా ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పం తీసుకుంది. మా ప్రజా పాలన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి ఆడపిల్లలు గొప్పగా చదువుకోవాలని ఆలోచనతో ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ముఖ్యమంత్రి స్థాపించడం జరిగింది.

మా మహిళలందరీి ఆశీర్వాదంతో నేడు రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతుంది పార్టీ కోసం శ్రమించిన మహిళలకు చట్టసభల్లో అవకాశం తప్పక వస్తుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నేను మాట ఇస్తున్నాను మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మరియు నేను కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన మహిళ కార్యకర్తల జాబితాను సిద్ధం చేయండి అది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కి అందజేసి వారందరికీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరుతాను. ఈ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన గొప్పగా పనిచేసే విధంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని అన్నారు.

ఈ సమావేశంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మహాలక్ష్మి, సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, చర్ల పద్మ, కరీంనగర్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి, నాయకురాలు పూదరి రేణుక గౌడ్,పడిశెట్టి వసంత లక్ష్మి, చంద్రకళ సిరిపురం లావణ్య, హసీనా, రాచర్ల పద్మ, కరీంనగర్ జిల్లాకు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మహిళా మున్సిపల్ చైర్ పర్సన్లు, మార్కెట్ కమిటీ మహిళా చైర్ పర్సన్లు, మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ ముఖ్య నేతలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story