Hyderabad: గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ కుమార్‌తో మంత్రి అడ్లూరి భేటీ!
Hyderabad: హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్‌ను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు.
Hyderabad: గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ కుమార్‌తో మంత్రి అడ్లూరి భేటీ!
హైదరాబాద్: గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్‌ను శుక్రవారం రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సందీప్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.
ధర్మపురి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా మంత్రి సందీప్ కుమార్‌కు వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.




