Peddapalli: రైతు సదస్సుల పేరుతో మొసలి కన్నీరు: మంత్రి అడ్లూరి!
Peddapalli: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు రైతు సదస్సుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి మండిపడ్డారు.
Peddapalli: రైతు సదస్సుల పేరుతో మొసలి కన్నీరు: మంత్రి అడ్లూరి!
పెద్దపల్లి: కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించని కేటీఆర్, నేడు లక్షేటిపేట ప్రమాద బాధితుల పరామర్శ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఏనాడు పట్టించుకోని కేటీఆర్ ఈరోజు రైతు సదస్సు పేరుతో మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేసారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ పై పల విమర్శలు చేశారు.
వాయిస్ ఓవర్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా పైడిచింతలపల్లి, రచ్చపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని ఓటర్ నమోదు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలసి పాల్గొన్నారు. ఆ తర్వాత అదే గ్రామంలో నిర్మించిన, రెండు అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ.మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పులకు చురకలు అంటించారు. ఆనాడు కొండగట్టు రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించని కేటీఆర్, నేడు లక్షేటిపేట ప్రమాద బాధితుల పరామర్శ పేరుతో నీచ రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు ఆందోళనలో ఉంటే, మాజీ కొప్పుల ఆటలు అడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నంది రిజార్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి సాగు నీరు రావని, సిద్దపేట దొరల ఇళ్లకు ఇక్కడి నీరు వెళ్తోందంటూ విమర్శించారు.




