Jagtial: యాసంగిలో వరి సాగు చేయొద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Jagtial: ఎల్నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగు చేయవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. కాకతీయ కాలువకు 9 రోజులు నీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Jagtial: యాసంగిలో వరి సాగు చేయొద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల: జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు.
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక పంటలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వచ్చే జూన్ వరకు వర్షాలు పడే అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారని తెలిపారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతుల పంటలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా, వారు సానుకూలంగా స్పందించి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే కాకతీయ కాలువకు 6,400 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
రైతుల ఇబ్బందులను గుర్తించి ఆదుకుంటున్నది రైతు ప్రభుత్వమని, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులందరూ పంటల సాగుపై తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.




