Karimnagar: ​ సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించిన బండి సంజయ్ కుమార్

Karimnagar: కరీంనగర్‌లో రూ. 67 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. నగరానికి రూ. 840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 21 Jun 2026 12:42 PM IST
Karimnagar
X

Karimnagar: ​ సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించిన బండి సంజయ్ కుమార్

కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ 50వ డివిజన్‌లో రూ.67 లక్షల వ్యయంతో పూర్తిచేసిన నూతన సీసీ డ్రైన్ మరియు సీసీ రోడ్డు ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ , నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ నగరానికి రూ.840 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు వెల్లడించారు.

గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.1000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నగరంలో చేపట్టినప్పటికీ, మరోసారి భారీ స్థాయిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లభించడం కరీంనగర్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందన్నారు. ఈ నిధులతో నగర మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతం కానుందని పేర్కొన్నారు.

రూ.840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను రాబోయే రెండు నెలల్లో సిద్ధం చేసి, అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన ప్రతిపాదనలను శరవేగంగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

కరీంనగర్ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి నగర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు , కార్పొరేటర్ ప్రవీణ్ రావు , కార్పొరేటర్ బండ రమణారెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story