Sircilla: ఘనంగా బండి సంజయ్ బర్త్‌డే వేడుకలు విద్యార్థులకు బుక్స్ పంపిణీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించి,
Sircilla: ఘనంగా బండి సంజయ్ బర్త్‌డే వేడుకలు విద్యార్థులకు బుక్స్ పంపిణీ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
సారంపల్లి గ్రామ ఉపసర్పంచ్ సిరిసిల్ల వంశీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీఎస్ (MPPS) పాఠశాలలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులు విద్యలో రాణించాలని ఆకాంక్షిస్తూ వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాజేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోల ఆంజనేయులు, బూత్ అధ్యక్షులు బరిగెల రాజు, సీనియర్ నాయకులు గుగ్గిల సత్తయ్య, కోల సాయి గణేష్, సిరిసిల్ల భారత్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.




