Manthani: మంథని మార్కెట్ యార్డ్‌లో మంత్రి శ్రీధర్ బాబు!

Manthani: మంథని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. తడిసిన ప్రతి వరి గింజనూ కొనుగోలు చేస్తాం.

SHANKAR, MANTHANI
Published on: 29 May 2026 2:34 PM IST
Manthani
X

Manthani: మంథని మార్కెట్ యార్డ్‌లో మంత్రి శ్రీధర్ బాబు!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని లోని వ్యవసాయ మార్కెట్ యార్డును రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ........

రైతులకు సంబంధించిన ప్రతి వరి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంద అన్నారు. వర్షాలు చెప్పి రావు కానీ ప్రతిపక్ష నాయకులకు చెప్పి వస్తున్నాయేమో వర్షాలు రైతుల పై రాజకీయం చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఇప్పటికే అధిక సంఖ్యలో రైతులకు వరి పంట వచ్చిందని ప్రభుత్వం వెంట వెంటనే కొనుగోలు చేసిందన్నారు.

ఇక్కడ ఆమాలీలు సరిపడా లేకపోవడంతో పక్క రాష్ట్రం అయినా మహారాష్ట్ర నుండి హమాలీలను తీసుకువచ్చి వరి ధాన్యాన్ని తూకం వేసినామని తెలిపారు. ఇప్పటికే అనేక గోదాంలు కొనుగోలు చేసిన వరి ధాన్యంతో నిండుకున్నాయని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం రైతుల పంటకు మద్దతు ధర ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి రాజకీయ గోస యాత్రలు చేపడుతుందని విమర్శించారు.

రైతులు అధైర్యపడవద్దని తడిసిన ప్రతి వరి గింజను రైస్ మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, PACSC మాజీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల, అధ్యక్షులు పోలు శివ, ఐలి ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story