Kothapalli: బావుపేట రోడ్డు ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Kothapalli: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్న ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Updated on: 1 Nov 2026 12:43 PM IST
Kothapalli
X

Kothapalli: బావుపేట రోడ్డు ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Kothapalli: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు.

కరీంనగర్ -1 డిపో కి చెందిన TS02 UC 6363 నంబర్ గల ఆర్టీసీ హైర్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన, నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR