Karimnagar: సేంద్రియ సాగు ఆరోగ్యకర సాగు.. నేల తల్లిని కాపాడుకుందాం
Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
Karimnagar: సేంద్రియ సాగు ఆరోగ్యకర సాగు.. నేల తల్లిని కాపాడుకుందాం
కరీంనగర్: హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఏప్రిల్ 27 నుండి మే 23 మధ్య జరిగే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా తక్కువ యూరియా వాడండి - సాగు ఖర్చు తగ్గించండి - నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి సేంద్రియ వ్యవసాయ విధానంపై గ్రామగ్రామాన అవగాహన కల్పించనున్న శాస్రవేత్తలు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ 60 సంవత్సరాల వ్యవసాయ విశ్వ విద్యాలయంలో అనేక మంది శాస్త్రవేత్తలను పట్టభద్రులు తయారు చేయడమే కాకుండా నూతన వంగడాలు ఆధునిక పద్ధతుల పై పరిశోధనలు చేస్తున్నారు.
రైతుల వద్దకే శాస్త్రవేత్తలు....
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్ళి అధిక దిగుబడి పొందడానికి అవసరమైన వంగడాలు , అధునాతన యంత్రాలు ,అవసరమైన ఎరువులపై అవగాహన కల్పిస్తున్నారు. నంగునూరు దగ్గర ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసుకున్నాం.రైతులు పంట మార్పిడి చేసుకొని ఆయిల్ ఫాం సాగు చేయాలి. ఆయిల్ ఫాం లో అధిక లాభాలున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు చెప్పే మంచిని ఇతర రైతులతో పంచుకొని అధిక దిగుబడి సాధించాలి.రైతులు చైతన్యవంతం కావాలి. ఔత్సాహికమైన రైతులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఊరు మొత్తం మారుస్తారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఆదర్శ రైతు వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కూడా ఆదర్శ రైతులకు శిక్షణ ఇచ్చి సాంకేతిక వ్యవసాయ మార్పులు బయట గ్రామీణ ప్రాంతాల రైతులు చేరాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్వయంగా మన గ్రామాల్లోకి వచ్చి రైతులకు అవగహన కల్పిస్తున్నారు.సేంద్రీయ ఎరువులు పంటలకు ఉపయోగించాలన్నారు. రసాయన ఎరువుల వల్ల అధిక దిగుబడి కాకుండా మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అందుకే ప్రతి ఒక్క రైతు శాస్త్రవేత్తల సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలని వారి సూచనల వల్ల అధిక దిగుబడులతోపాటు ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్, పి.జె.టి. ఏ.యు., హైదరాబాద్, వ్యవసాయ పరిశోధన సహా సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలస డా. ఎస్. హరీష్ కుమార్ శర్మ, వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డా. రాంప్రసాద్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. హరికృష్ణ. బి. మరియు శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




