Manthani: మంథని టు ఫాక్స్‌కాన్.. ఆడబిడ్డల చేతికి కొలువు పత్రాలు!

Manthani: మంథని నియోజకవర్గంలోని మారుమూల పల్లెల యువతులు ప్రముఖ బహుళజాతి సంస్థ ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలు సాధించారు.

SHANKAR, MANTHANI
Published on: 6 Sept 2026 9:20 PM IST
Manthani
X

Manthani: మంథని టు ఫాక్స్‌కాన్.. ఆడబిడ్డల చేతికి కొలువు పత్రాలు!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన యువతులు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థ ఫాక్స్ కాన్ లో ఉద్యోగాలు సాధించారు.

ముత్తారం, రామగిరి, కాటారం, పలిమెల, మహాదేవపూర్, మహాముత్తారం, కమాన్ పూర్, మంథని మండలాలకు చెందిన విద్యార్థినులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి హైదరాబాద్ లోని ఫాక్స్ కాన్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఎంపికైన విద్యార్థినులకు శనివారం హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఆత్మవిశ్వాసం, ప్రతి ఆడబిడ్డ జీవితంలో ఆర్థిక స్వావలంబన సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉద్యోగాలు పొందిన యువతులు, వారి తల్లిదండ్రులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story