Manthani: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
Manthani: మంథని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు. తడిసిన ప్రతి గింజను కొంటామని రైతులకు భరోసా.
Manthani: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలోని వ్యవసాయ మార్కెట్ యాడ్ లో అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడద్దు అకాల వర్షానికి తడిసిన ప్రతి ఒక్క వరి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
పకృతి వైపరీత్యాల వల్ల ఆకాల వర్షాలు పడి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల వరి ధాన్యం తడుస్తుందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వర్షానికి తడిసిన ప్రతి ఒక్క వరి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈరోజు సాయంత్రం వరకు
గన్ని బ్యాగులు, టర్ఫాలిన్ కవర్లను అందుబాటులోకి తీసుకు వస్తావని పేర్కొన్నారు. బయట నుండి లోపలికి వర్షం నీరు రాకుండా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు.




