Karimnagar: పదేళ్లు గ్రూప్-1 నిర్వహించకుండా కాలయాపన చేశారు!

Karimnagar: తెలంగాణలో నిరుద్యోగులను పెంచింది ముమ్మాటికి బీఆర్ఎస్సేనని, పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు ఎందుకు పెట్టలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 19 July 2026 3:24 PM IST
Karimnagar
X

Karimnagar: పదేళ్లు గ్రూప్-1 నిర్వహించకుండా కాలయాపన చేశారు!

Karimnagar: నిరుద్యోగ యువతరాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం వారి హాయంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్న పదేండ్ల సమయంలో మీరు ఎందుకు గ్రూపు అని పరీక్షలు నిర్వహించలేదని అన్నారు. తెలంగాణ వచ్చినంక ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూసిన గ్రూప్ వన్ పరీక్షలు 10 సంవత్సరాల కాలంలో నిర్వహించకుండా కాలయాపన చేసి ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారా అని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఎంతోమంది గ్రూప్ వన్ పరీక్షలు రాసి మళ్లీ అవకాశం కోసం ఎదురు చూస్తే వాళ్లకి 30 సంవత్సరాల వయస్సు వచ్చిన పరీక్షలు నిర్వహించకుండా రోడ్డుపై నిలబెట్టినది ఘన చరిత్ర మీద అని హేళన చేశారు. గ్రూప్-1 అధికారి కావాలని కోరుకున్న వేలాది మందికి ఏం జవాబు చెప్తారు? వారికి కెటిఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించినం. మీరు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, ఆగలేదు. తీసుకొచ్చి చూపెట్టి ఈరోజు దాదాపు 600 మంది గ్రూప్-1 అధికారులుగా,ఈ జిల్లాకు సంబంధించి అనేక మంది గ్రూప్-1 అధికారులుగా నియామకాలు చేయడం జరిగిందన్నారు.

తెలంగాణలో నిరుద్యోగులను పెంచింది ముమ్మాటికి బి ఆర్ ఎస్..

నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులే ఎక్కువయ్యాలని అది చేసిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందన్నారు.

మీరు చెప్తా ఉన్నారే గొప్పలు, ఆ అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ, ఆ చిక్కడపల్లి చుట్టూ, ఆ చార్మినార్ చౌరస్తా చుట్టూ తిరిగి తిరిగి, చదువుకున్న వారిని నిరుద్యోగులుగా నిలబెట్టారు. కానీ మేము అధికారంలోకి వచ్చాక నియామకాలు చేపట్టామని ఇప్పుడు ఉన్న తాండూర్ మున్సిపల్ కమిషనర్, వికారాబాద్ కమిషనర్, పగిలి కమిషనర్ ఇలా ఎంతోమందికి గ్రూప్ వన్ అధికారులుగా నియామకాలు చేపట్టామని అది కాంగ్రెస్ ఘనత అన్నారు. మీ అబద్ధపు మాటలకు కాలం చెల్లిందని ఎవరు నమ్మే పరిస్థితిలో లేదని అందుకే ఏదో ఒక అబద్ధపు ప్రచారాలు చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story