Karimnagar: ధాన్యం కొనుగోలులో కొత్త అధ్యాయం.. రైతుల పాలిట కాంగ్రెస్ భరోసా!
Karimnagar: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఓదెల మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
Karimnagar: ధాన్యం కొనుగోలులో కొత్త అధ్యాయం.. రైతుల పాలిట కాంగ్రెస్ భరోసా!
Karimnagar: ఓదెల మండలంలోని గుండ్లపల్లి , కనగర్తి, మడక, పోత్కపల్లి, శానగొండ, బాయమ్మపల్లి, ఇందుర్తి, గుంపుల మరియు గూడెం గ్రామాల్లో బుధవారం రోజున సింగిల్ విండో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో పెద్దపల్లి నియోజకవర్గంలో వరి ధాన్యం కటింగ్ లేకుండా కొనుగోలు చేయడంతో పాటు మద్దతు ధరకు రైతుల ధాన్యమును కొనుగోలు చేయడం జరుగుతుంది అని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల రైతులు వేసవిలో సాగునీరు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నియోజకవర్గంలో కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల రైతులకు సాగునీటికి గడ్డి పొసంత ఇబ్బంది కూడా రానీయలేదు అన్నారు. ప్రస్తుతం రైతులు ఇక నీరు మాకు వద్దు అంటున్నారు అన్నారు. రైతుల పంటల విషయంలో గాని, వరి ధాన్యం కటింగ్ విషయంలో గాని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాను అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 40 కిలోలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మూడు నుంచి పది కిలోల వరకు వరి ధాన్యం కటింగ్ చేసి రైతుల పొట్ట కొట్టారు అన్నారు.
ప్రస్తుతం తాను ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు వరి ధాన్యం కటింగ్ లేకుండా మిల్లులకు ధాన్యం అందించడం జరుగుతుంది అన్నారు. ప్రస్తుతం రైతులు హార్వెస్టర్ వరి పంట కోస్తున్నప్పుడు ఫ్యాన్ కొంచెం ఎక్కువగా పెట్టి తాలు, చెత్త రాకుండా చూసుకోవాలి అన్నారు. పొత్కపల్లిలో మార్క్ ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రం నడుస్తుందని ఓదెలలో కూడా మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు పేర్కొన్నారని తప్పకుండా సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు అన్నారు. ఓదెల మండలంలో 2024 - 2025 లో సన్నవడ్లకు 6 కోట్ల 67 లక్షల రైతులకు బోనస్ వచ్చిందని, అదేవిధంగా 2025 - 2026 సంవత్సరంలో సన్న వడ్లకు రైతులకు 13 కోట్ల 52 లక్షల బోనస్ రావడం జరిగింది అన్నారు. గత ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తానని మోసం చేసింది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గార్లు తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఎకరాకు 6000 చొప్పున రైతులకు ఇవ్వడం జరిగింది అన్నారు. గత ప్రభుత్వం రైతులు మొక్కజొన్న పండిస్తే ఆ పంటలు కొనలేదని ప్రస్తుతం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుంది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేసిన అప్పులకు అసలు, వడ్డీ కడుతూ రైతులకు రైతు బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ తో పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అన్నారు.
ప్రభుత్వం సన్న వడ్లకు రైతు బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు రైతుల పండించిన సీడ్ వరి ధాన్యమునకు క్వింటాలకు రెట్టింపు ధర ఇస్తూ హార్వెస్టర్ కటింగ్, బెరుకులు వేరడం, పంటకు కొట్టే మందులకు కూడా సీడ్ కంపెనీలే భరిస్తున్నాయి అనడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బోనస్ ఇవ్వడమే ఎందుకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా ఎకరంకు 40 బస్తాల నుంచి 60 బస్తాల పంట పండిస్తున్నారు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రభుత్వంలో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని కెసిఆర్ మాటలన్నీ అబద్ధాల మూటలే అన్నారు. ప్రభుత్వమునకు సూచన చేయవలసిన కెసిఆర్ అభండాలు వేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25 లక్షల 42 వేల రైతులకు 20 వేల కోట్ల పైన రైతు రుణమాఫీ చేసింది అన్నారు. గత బిఆర్ఎస్ పరిపాలనలో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో సాగునీరు అందక పంటలు ఎండి పశువులు మేసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఈ రెండు సంవత్సరాల మూడు మాసాలలో తాను ఎమ్మెల్యేగా రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ సాగునీరు పుష్కలంగా అందిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం పంటలు బాగా పండి ఇక సాగునీరు మాకద్దు అంటూ రైతులే స్వయంగా చెప్పడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉండి వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,కాంగ్రెస్ పార్టీ ఓదెల మండల అధ్యక్షులు మూల ప్రేమ సాగర్ రెడ్డి, మార్కెట్ చెర్మన్ కూర మల్లారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్, సుమన్ రెడ్డి, రజినీకాంత్,పలు గ్రామాల సర్పంచ్లు, మార్కెట్ డైరెక్టర్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




