Jagtial: పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలి.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 22 April 2026 9:37 PM IST
Jagtial
X

Jagtial: పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలి.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు చెప్యాల, రామకిష్టాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించుకునేలా కొనుగోలు కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ధాన్యం తూకం, రవాణా, చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story